V6 News

ప్రజా చైతన్యంతోనే మలేరియా నివారణ : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజా చైతన్యంతోనే మలేరియా నివారణ : కలెక్టర్ కుమార్ దీపక్

కోల్​బెల్ట్, వెలుగు: దోమల నియంత్రణ, పరిసరాల పరిశుభద్రత పాటించాలని, ప్రజల చైతన్యంతోనే మలేరియా నివారణ సాధ్యమని మంచిర్యాల కలెక్టర్​ కుమార్​ దీపక్​అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం ఊరు మందమర్రిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని కలెక్టర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులను నిరోధించేందుకు దోమల వృద్ధిని అరికట్టాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. వైద్యాధికారులతో కలిసి ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎంహెచ్​వో​అనిత, ప్రోగ్రామ్​ఆఫీసర్లు సుధాకర్​ నాయక్, ప్రసాద్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

నస్పూర్, వెలుగు: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ రాములు, ఆర్డీవో శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లు, అధికారులతో రివ్యూ నిర్వహించి పలు సూచనలు చేశారు.