
న్యూఢిల్లీ: పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ వరుసగా మూడో ఎడిషన్‌లో గోల్డ్ నెగ్గాడు. దాంతో ఈ టోర్నీలో మెస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా స్టాండ్స్‌లో ఉండి ఉత్సాహపరచగా 27 ఏండ్ల సుమిత్ మంగళవారం జరిగిన మెన్స్ జావెలిన్ ఎఫ్64 విభాగంలో తన ఐదో ప్రయత్నంలో 71.37 మీటర్లు విసిరి చాంపియన్‌షిప్ రికార్డును నెలకొల్పాడు. జావెలిన్ ఎఫ్44 విభాగంలోసందీప్ సాగర్ 62.82 మీటర్ల త్రోతో అనూహ్యంగా స్వర్ణం గెలుచుకోగా, సందీప్ 62.67 మీటర్లతో రజతం సాధించాడు. మరోవైపు, మెన్స్ ఎఫ్56 డిస్కస్ త్రో విభాగంలో యోగేశ్ కథునియా 42.49 మీటర్ల త్రోతో రజత పతకం గెలుచుకున్నాడు.