వెలుగు ఫొటోగ్రాఫర్ల అవార్డుల జోరు

వెలుగు ఫొటోగ్రాఫర్ల అవార్డుల జోరు

హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలో V6 వెలుగు ఫోటోగ్రాఫర్లు సత్తా చాటారు. వివిధ కేటగిరీలకు గానూ మొత్తం 40 అవార్డుల్లో 10 అవార్డులు కైవసం చేసుకున్నారు. బంగారు తెలంగాణ, పల్లె, పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తా చిత్రం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్ విభాగాల్లో పోటీ నిర్వహించారు. 

జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోషియేట్ ప్రొఫెసర్ ఎం నాగరాజ, సీనియర్ జర్నలిస్ట్‌ డాక్టర్‌ గోవిందా రాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్. సతీశ్‌ సభ్యులుగా ఉన్న కమిటీ.. విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి రూ.20వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, కన్సోలేషన్ బహుమతికి రూ.5వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్‌ను ప్రదానం చేయనున్నారు. ఈ నెల 25న బహుమతులను ప్రదానం చేయనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది.

V6  వెలుగు నుంచి అవార్డులకు ఎంపికైనవారు...

బంగారు తెలంగాణ కేటగిరీ

1. ఎన్.శివ కుమార్ (థర్డ్)
2. నరేశ్ వరికిల్ల (కన్సోలేషన్) 

బెస్ట్ న్యూస్ పిక్చర్ కేటగిరీ

1. నరేశ్ వరికిల్ల (ఫస్ట్ )
2. ఓరిగంటి సురేశ్ గౌడ్ (కన్సోలేషన్)
3. మహిమల భాస్కర్ రెడ్డి (కన్సోలేషన్)

పట్టణ, గ్రామీణ మౌళిక సదుపాయాల అభివృద్ది కేటగిరీ

1. మహిమల భాస్కర్ రెడ్డి (సెకండ్) 
2. నరేశ్ వరికిల్ల (కన్సోలేషన్)

స్కై లైన్ ఆఫ్ హైదరాబాద్ కేటగిరీ

1. నరేశ్ వరికిల్ల (థర్డ్)
2. నరేశ్ వరికిల్ల (కన్సోలేషన్)
3. మహిమల భాస్కర్ రెడ్డి (కన్సోలేషన్)