- మెడికవర్ చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి
పద్మారావునగర్, వెలుగు: ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేసే న్యూమోనియాను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారి తీస్తుందని సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ పల్మనాలజిస్ట్ డా. గంగాధర్ రెడ్డి మళ్లూ తెలిపారు. వృద్ధులు, మధుమేహం, గుండె వ్యాధులు ఉన్నవారిలో న్యూమోనియా ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు.
ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, అలసట, ఆకలి తగ్గడం న్యూమోనియా ప్రధాన లక్షణాలుగా పేర్కొన్నారు. ఎక్స్-రే, రక్త పరీక్షల ద్వారా న్యూమోనియాను సకాలంలో గుర్తించి యాంటీబయాటిక్స్, ఆక్సిజన్ సపోర్ట్ ద్వారా చికిత్స అందిస్తే నయమవుతుందని సూచించారు. నిత్యం చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, నో స్మోకింగ్, ఫ్లూ, న్యూమోకాకల్ టీకాలు ద్వారా ముందస్తు నివారణ సాధ్యమని తెలిపారు.
