టెక్నాలజీ..లాక్..​ హైడ్..​ డాటా సేఫ్ 

టెక్నాలజీ..లాక్..​ హైడ్..​ డాటా సేఫ్ 

స్మార్ట్​ ఫోన్​ చేతిలో లేకపోతే రోజు గడవని ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు. ఫోన్​ కాల్స్​, చాటింగ్​, మనీ ట్రాన్స్​ఫర్, వీడియోలు, ఫొటోలు, మెయిల్స్.. ఇలా ఒకటేంటి బోలెడన్ని అవసరాలు తీరుస్తుంది స్మార్ట్​ ఫోన్. కాకపోతే అది చేతిలో భద్రంగా ఉన్నంత సేపే డాటా కూడా సేఫ్​. అలాకాకుండా చేతులు మారి వేరే వాళ్ల దగ్గరకి చేరిందో.. డాటా మొత్తం లాగేస్తారు. పర్సనల్ ఫొటోలు, చాట్స్, ఆఫీస్​, డబ్బు... ఇలా పర్సనల్​ డిటెయిల్స్​ అన్నీ వేరేవాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అలాకాకుండా ఉండాలంటే... స్మార్ట్​ ఫోన్​లో ఉండే యాప్స్​కి తాళం వేయాలి. 

  •     ఆండ్రాయిడ్ ఫోన్​లో...  గూగుల్ ప్లే స్టోర్​ నుంచి యాప్​ లాక్ అనే అప్లికేషన్​ డౌన్​లోడ్ చేసుకోవాలి. 
  •     ఇన్​స్టాల్​ చేసుకున్నాక... అది అడిగిన పర్మిషన్స్​ ఇవ్వాలి. 
  •     యాప్​ లాక్​ కోసం... సెట్టింగ్స్​కి వెళ్లి పాస్​వర్డ్​ సెట్టింగ్స్​పై ట్యాప్ చేస్తే ఫింగర్ ప్రింట్, ఫేస్​ అన్​లాక్, కీస్​, నెంబర్స్​ వంటి ఆప్షన్స్​ కనిపిస్తాయి.  వాటిలో నచ్చినదాన్ని సెలక్ట్​ చేసుకోవాలి.
  •     యాప్​ ఓపెన్ చేసి ప్లస్ (+) బటన్​ ట్యాప్ చేయాలి. దాంతో అక్కడ ఫోన్​లోని అప్లికేషన్స్ లిస్ట్ కనిపిస్తుంది.
  •     ఏ యాప్స్​కి లాక్ వేయాలనుకుంటే వాటిని సెలక్ట్ చేసుకోవాలి. 
  •     ఆ యాప్స్ సెలక్ట్ చేసుకున్నాక మళ్లీ ప్లస్ (+) బటన్​ ట్యాప్‌ చేస్తే అవన్నీ లాక్​ అయిపోతాయి. అంతే ఇక ఆ యాప్స్ ఎవరూ ఓపెన్​ చేయలేరు. 
  •     యాప్​ లాక్​ వాడడానికి ఎలాంటి ఫీజు ఉండదు. యాడ్స్​ కూడా రావు. అయితే, ఇలాంటి యాప్స్ ప్లే స్టోర్స్​లో చాలానే ఉన్నాయి. వాటిలో బెటర్​ యాప్​ సెలక్ట్​ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.  

ఫొటోలు, వీడియోలకు...

చాలా స్మార్ట్​ఫోన్స్​లో ఫొటోలు, వీడియోలను హైడ్ చేసుకునే ఆప్షన్స్​ ఉంటాయి. కాకపోతే వాటిని ఎనేబుల్ చేసుకోవడం తెలియాలి. అందుకు ఏం చేయాలంటే.. ఫోన్​లో గ్యాలరీలో సెట్టింగ్స్​ మార్చుకోవాలి. ఆ ఆప్షన్​ ఒక్కో ఫోన్​లో ఒక్కోపేరుతో ఉంటుంది. కాబట్టి సెట్టింగ్స్​ మెనూకి వెళ్లాక ​సెక్యూర్​ ఫోల్డర్​ లేదా ప్రైవేట్​ వంటి ఆప్షన్లు చూసి సెలక్ట్ చేసుకోవాలి. 

వాట్సాప్​లో లాక్​తోపాటు హైడ్!​

వాట్సాప్​లో చాట్​లాక్​ ఆప్షన్​ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ లాక్​ వేసినట్లు తెలియకుండా ఉండేలా హైడ్ ఆప్షన్​ కూడా తీసుకొచ్చింది వాట్సాప్. అదెలాగంటే.. వాట్సాప్​లో ఫింగర్​ ప్రింట్ లేదా పాస్​వర్డ్ లాక్ ఉంటుంది. దీన్ని వాడి చాట్ కనపడకుండా చేయొచ్చు. అందుకోసం చాట్​ని లాంగ్​ప్రెస్ చేస్తే పైన బాణం గుర్తు కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేస్తే ఆ చాట్ ఆర్కైవ్​లోకి వెళ్తుంది. దాంతో ఆ చాట్ ఎవరూ చూడలేరు. యూజర్​ చూడాలనుకుంటే సెర్చ్​బార్​లో సెర్చ్ చేయాలి. లేదంటే కిందకి స్క్రోల్ చేసినా కనిపిస్తుంది. దీంతోపాటు ఒక్కో చాట్​ని కూడా లాక్​ చేసేయొచ్చు. అందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్​లో ప్రైవసీ ఆప్షన్​ సెలక్ట్ చేస్తే మిగతా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో కావాల్సిన దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.