
జాగ్రెబ్ (క్రొయేషియా): ఇండియా యంగ్ రెజ్లర్ సూరజ్ వశిష్ట్.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోనే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన మెన్స్ 60 కేజీల బౌట్‌లో సూరజ్ 1–4తో జార్జీ టిబిలోవ్ (సెర్బియా) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన బౌట్స్‌లో ఇండియన్ రెజ్లర్ వరుసగా 3–1తో ఏంజెల్ టెల్లెజ్‌పై, 3–1తో విక్టర్ సియోబానుపై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.
జూనియర్ లెవెల్లో పతకాలు సాధించిన సూరజ్‌కు సీనియర్ టోర్నీలో ఆడటం ఇదే మొదటిసారి. కాబట్టి రాబోయే రోజుల్లో కచ్చితంగా మెడల్స్ గెలుస్తాడని ఆశిస్తున్నారు. 72 కేజీల బౌట్‌లో అంకిత్ గులియా క్వాలిఫికేషన్స్‌లోనే వెనుదిరిగాడు. టెక్నికల్ సుపిరియారిటీలో యోన్గున్ నోహ్ (కొరియా) పైచేయి సాధించాడు. 97 కేజీల్లో నితీశ్ 3–2తో ఫిలిప్ స్మెట్కోపై గెలిచినా.. తర్వాతి రౌండ్‌లో 0–4తో మొహమ్మదాది సారావి (ఇరాన్) చేతిలో ఓడాడు.