వీడియో: ఏనుగు కోసం తొలిసారిగా ప్రపంచంలోనే భారీ ఆర్టిఫిషియల్ లెగ్

వీడియో: ఏనుగు కోసం తొలిసారిగా ప్రపంచంలోనే భారీ ఆర్టిఫిషియల్ లెగ్

మనం ఇప్పటివరకు మనుషుల కోసం ఆర్టిఫిషియల్ లెగ్స్ తయారుచేయడం చూశాం. కానీ ఓ డాక్టర్ మాత్రం భారీ ఏనుగు కోసం మొదటిసారిగా
ఆర్టిఫిషియల్ లెగ్‌ను తయారుచేశాడు. థాయ్‌లాండ్‌కు చెందిన మోషా అనే ఏనుగు 10 సంవత్సరాల క్రితం థాయ్-మయన్మార్ బార్డర్‌లో ల్యాండ్‌మైన్ మీద కాలుపెట్టింది. అది పేలడంతో మోషా తన కాలును కోల్పోయింది. అది తెలిసిన డాక్టర్ థర్డ్‌చాయ్ జీవాకేట్ దాన్ని తన ఏషియన్ ఎలిఫెంట్ ఫౌండేషన్ సంస్థకు తీసుకెళ్లాడు. మోషా నడవలేక పడుతున్న ఇబ్బందిని చూసిన జీవాకేట్ దానికోసం ఆర్టిఫిషియల్ లెగ్ తయారుచేయాలనుకున్నాడు.

మోషాను ఆయన ఫౌండేషన్‌కు తీసుకెళ్లిన సమయంలో మోషా 600 కేజీల బరువుతో ఉంది. అప్పటినుంచి ఆయన మోషా కోసం ఆర్టిఫిషియల్ లెగ్ తయారుచేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మోషా సుమారుగా 2000 కేజీల బరువుతో ఉంది. ఇప్పుడు దానికోసం డాక్టర్ జీవాకేట్ ఒక భారీ ఆర్టిఫిషియల్ లెగ్‌ను తయారుచేశాడు. దాదాపు 2 వేల కేజీల బరువును మోసే బలమైన, పెద్దదైన ఆర్టిఫిషియల్ లెగ్ తయారుచేయడం ప్రపంచంలోనే మొదటిసారి. ఆ లెగ్‌తో మోషా ఏంచక్కా నడుస్తూ తిరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

For More News..

15 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన పోలీస్ ఫుట్‌పాత్ మీద..

పండగపూట షోరూం దోచుకెళ్లిన దొంగలు

కరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి

13 ఏళ్ల బ్యాన్ తర్వాత అందుబాటులోకి గర్భనిరోధక మాత్రలు