తోటోళ్లను చంపుకు తినే చిలకమ్మ

తోటోళ్లను చంపుకు తినే చిలకమ్మ

చిట్టిపొట్టి చిలకలు, భలే ముద్దొస్తయి. ఇంట్ల పెంచుకుంటే మన మాటలనూ అప్పజెప్పేస్తయి. కానీ, ఈ చిలక గురించి తెలుసుకుంటే మాత్రం కొంచెం భయమేస్తది. ఎందుకంటే అది 3.2 అడుగుల ఎత్తు ఉంది కాబట్టి. తోటి చిలకలు, పక్షులను చంపి తినేస్తది కాబట్టి. దానికి సైంటిస్టులు హెరాకిల్స్ ఇనెక్స్పెక్టేటస్ అని పేరు పెట్టారు. లోకంలో ఇదే అతి పెద్ద చిలక అని సైంటిస్టులు భావిస్తున్నారు. న్యూజిల్యాండ్లోని సెయింట్ బథాన్స్గా పిలిచే సెంట్రల్ ఒటాగోలో దీని శిలాజాలను దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లైండర్స్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ మధ్యే వెలికి తీశారు. ఎప్పుడో 1.9 కోట్ల ఏళ్ల క్రితం ఇది భూమ్మీద బతికేదట. ఏడు కిలోల బరువు తూగేదని చెబుతున్నారు.