ఐలాండ్‌లో ఒకే ఒక ఇల్లు.. ప్రపంచంలోనే లోన్లీ ఇల్లు ఇదేనట!

ఐలాండ్‌లో ఒకే ఒక ఇల్లు.. ప్రపంచంలోనే లోన్లీ ఇల్లు ఇదేనట!

చుట్టూ నీరు.. మధ్యలో ఓ ఐలాండ్.. ఆ ఐలాండ్‌లో ఒకే ఒక ఇల్లు. ఎటుచూసినా ఒక మనిషిలేడు.. ఒక ఇల్లు లేదు. అటువంటి ఇంట్లో ఉండాలంటే మీరు ఉండగలరా? అలాంటి ఇల్లు దక్షిణ ఐలాండ్‌లోని ఎల్లిడేలో ఉంది. ఈ ఎల్లిడే 15 నుంచి 18 ద్వీపాల ద్వీపసమూహమైన వెస్ట్‌మన్నేజార్‌లో భాగం. ఈ ద్వీపం ప్రస్తుతం మనుషులు లేకండా ఉంది. కానీ, ఒకప్పుడు ఇక్కడ ఐదు కుటుంబాలు నివసించేవట. ఈ ద్వీపంలో నివసించిన చివరి కుటుంబం 1930 వరకు అక్కడ ఉందని తెలుస్తోంది.

మారుమూల ద్వీపంలో ఉన్న ఈ ఇంటి చుట్టూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఇల్లు ఒక బడా బిలియనీర్ చేత నిర్మించబడినట్లు తెలుస్తోంది. భూమి మీద జోంబీ అపోకాలిప్స్ దాడిచేస్తే అప్పుడు ఈ ఇంటిని ఉపయోగించాలని సదరు బిలియనీర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ ఇల్లు ప్రసిద్ధ ఐస్లాండిక్ గాయకుడికి చెందినదని అంటున్నారు. మరికొంతమంది మాత్రం అసలు ఈ ఇల్లు లేనేలేదని.. ఫోటోలను మార్ఫింగ్ చేశారని కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఇల్లు ఎల్లిడే ద్వీపంలో ఉంది. ఎల్లిడే హంటింగ్ అసోసియేషన్ యాజమాన్యం ఈ ఇంటిని తమ పరిధిలో ఉంచుకుంది. అసోసియేషన్ సభ్యులు పఫిన్‌లను వేటాడటం కోసం 1950వ దశకంలో ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఫోటోల కోసం..

For More News..

అమెరికాలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేత

పెళ్లింట్లో భారీ చోరీ.. 210 తులాల నగలు మాయం