వందేండ్ల డాక్టర్​

వందేండ్ల డాక్టర్​

డాక్టర్లు దేవునితో సమానం అంటారు. ఎందుకంటే ప్రాణంపోసే ఈ వృత్తికి అంత గొప్ప స్థానముంది కాబట్టి. అలాంటి వృత్తిలోని ఓ డాక్టర్​కు ఇటీవలే గిన్నిస్​ రికార్డు దక్కింది. అందులో స్పెషల్​ ఏముంది అనుకుంటున్నారా? ఉంది. ఎందుకంటే వందేండ్లు వచ్చినా ఇప్పటికీ పేషెంట్లను చూస్తున్న డాక్టర్​ ఆయనే మరి. పేరు హోవార్డ్​ టక్కర్​. ఈయన సొంతూరు.. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఉన్న క్లీవ్​లాండ్​ సిటీ. 1922 జులై 10న పుట్టిన టక్కర్..1947లో ఎంబీబీఎస్​ చదివాడు.

అదే సంవత్సరం అమెరికా నేవీలో న్యూరాలజిస్ట్​గా చేరాడు. కొరియా యుద్ధంలో అమెరికా సైన్యంలో డాక్టర్​గా పనిచేశాడు. తిరిగొచ్చాక సొంతూరులోని ఓ హాస్పిటల్​లో చేరాడు. అప్పటి నుంచి75 ఏండ్లుగా అదే వృత్తిలో ఉన్నాడు. అంతేకాదు, అక్కడి మెడికల్​ కాలేజీలో వారానికి రెండుసార్లు పాఠాలు కూడా చెప్తున్నాడు. అందుకే ఇటీవల ఆయన వందో పుట్టినరోజుకు ఐదుగురు అమెరికా మాజీ ప్రెసిడెంట్స్​ విషెస్​ చెప్తూ లెటర్స్​ కూడా రాశారు.