ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని లూసిల్ రాండన్ అలియాస్ ఆండ్రీ (118) మరణించారు. ఫ్రాన్స్‌లోని టౌలాన్ నగరంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు రాండన్ ప్రతినిధి డేవిడ్ తవెల్లా తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన ఆండ్రీ మరణవార్త విన్న టౌలాన్ నగర మేయర్ హుబెర్ట్ ఫాల్కో.. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.

ఆండ్రీ మరణం తనకు బాధ కలిగించిందని మేయర్ తెలిపారు.1904వ సంవత్సరంలో ఫ్రెంచ్ పట్టణంలోని అలెస్‌లో ఆండ్రీ జన్మించారు. ఈమె 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంచి బయటపడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ ఆండ్రీ జీవించి ఉండడం చెప్పుకోదగిన విషయం.19 సంవత్సరాల వయస్సులో కాథలిక్ గా మారిన ఆండ్రీ.. ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసినిగా మారారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే 2021వ సంవత్సరంలో కరోనా వచ్చినా కూడా ఆమె దాన్నుంచి బయటపడ్డారు.