ప్రపంచ కురు వృద్దుడు మృతి

ప్రపంచ కురు వృద్దుడు మృతి

టోక్యో: ప్రపంచ కురు వృద్దుడు మరణించాడని తెలిపారు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అధికారులు. ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న జపాన్ కు చెందిన చిటెట్సు వటనాడె(112) ఇటీవలే గిన్సీస్ వరల్డ్ రికార్డుకెక్కారు. అయితే నిత్యం ఉషారుగా ఉండే చిటెట్సు ఆదివారం మరణించాడని చెప్పారు. 112 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరని.. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు అఫీషియల్ గా తెలిపారు.

గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల కారణంగా వటనబె ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. చిటెస్తు వటనాబేకు ఐదుగురు సంతానం కాగా..12 మనవళ్లు, 17 ముని మనవండ్లు ఉన్నారని తెలిపారు ఫ్యామిలీ సభ్యులు. ఎక్కువ కాలం బతకాలంటే శాంతి.. నిత్యం చిరునవ్వుతో ఉండాలని చిటెట్సు చెప్పేవాడని తెలిపారు.