బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనంలో పురుగులు

బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనంలో పురుగులు
  • ఆందోళనకు దిగిన విద్యార్థులు

నిర్మల్: జిల్లాలోని  బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులకు వడ్డంచే భోజనంలో మళ్లీ పురుగులు వచ్చాయి. దీంతో మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ వారంలో ఇలా జరగడం మూడో సారి అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఆలూ కర్రీలో కప్ప వచ్చిందని విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. అయితే ఆ ఘటన జరిగిన మరుసటి రోజే మళ్లీ అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. ఈ రోజు కూడా అన్నంలో పురుగులు వచ్చాయని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పదే పదే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై  ఆందోళన చెందుతున్నారు. పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నామని, దీంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని వారు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

దోచుకునెటోళ్లను వదలం

గోవా అసెంబ్లీకి మూడు జంటలు