బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

లక్నో: బీజేపీతో తమ పార్టీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోదని ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. ఎన్నికల కోసం బీజేపీతో కూటిమిలో చేరాల్సి వస్తే రాజకీయాల నుంచి రిటైరవ్వడానికే మొగ్గు చూపుతానని ఆమె స్పష్టం చేశారు. ఇరు పార్టీల సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనేదే (సర్వజన్ సర్వ ధర్మ హితే) బీఎస్పీ సిద్ధాంతమని.. బీజేపీది పూర్తిగా వ్యతిరేక ఐడియాలజీ అని పేర్కొన్నారు. బీజేపీవి మతపర, కులపరమైన రాజకీయాలన్నారు. సమాజ్‌‌వాదీ పార్టీ నేతలను ఓడించడానికి బీజేపీ లేదా మరే ఇతర పార్టీ అభ్యర్థికి ఓటేయడానికైనా బీఎస్పీ సిద్ధమని రీసెంట్‌‌గా మాయావతి పేర్కొన్న సంగతి తెలిసిందే.