
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. మహిళా క్రికెటర్ల కోసం బాలీవుడ్ స్టార్స్ కదిలొచ్చారు. తమ డ్యాన్స్, ఆట పాటలతో ఈవెంట్‌ను మరింత కలర్‌ఫుల్ మార్చారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌తో పాటు షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రల డ్యాన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ ఆరంభ వేడుకల చివరలో 'కింగ్ ఖాన్'.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, ఆసీస్ క్రికెటర్ మెగ్ లానింగ్‌కు తన ఐకానిక్ సిగ్నేచర్ పోజ్ నేర్పించారు. ఎలా కాళ్లు కదపాలో, ఎలా చేతులు చాపాలో దగ్గరుండి మరీ నేర్పించారు. అందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు "కెహతే హైన్ అగర్ కిసీ చీజ్ కో దిల్ సే చాహో, తో పూరీ కైనాత్ ఉసే తుమ్సే మిలానే కి కోషిష్ మే లాగ్ జాతి హై.." అని క్యాప్షన్ జోడించింది.
"????? ???? ???? ???? ????? ?? ??? ?? ?????, ??? ????? ??????? ??? ????? ?????? ?? ??????? ???? ??? ????? ???"??
— Delhi Capitals (@DelhiCapitals) February 22, 2024
King ? Queen ?#YehHaiNayiDilli #TATAWPL #ShahrukhKhan #MegLanning |… pic.twitter.com/iynVjwH1jg