నిర్మల్లో కుస్తీ పోటీలు

నిర్మల్లో కుస్తీ పోటీలు

నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో శ్రీ రామ నవమి వేడుకల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారి దర్శనానంతరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కుస్తీ పోటీలకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా మల్లయోధులు తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. 
సై అంటే సై అంటూ తొడకొట్టి తలపడ్డ మల్లయోధులు
వేలాది మంది జనం కేరింతల మధ్య కామోల్ కుస్తీ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. కుస్తీ పోటీలు చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. సై అంటే సై అంటూ తలపడిన మల్లయోధులను జనం కేరింతలు.. చప్పట్లతో ప్రోత్సహించారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆసక్తికరంగా సాగిన కుస్తీ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా 5 తులాల వెండి కడియంతో పాటు 5 వేల నగదును అందజేశారు.

 

 

ఇవి కూడా చదవండి

చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు

ట్రాన్స్ జెండర్లకు భద్రత, రక్షణ కల్పిస్తాం

అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం.

మా వివరాలు ఇవ్వొద్దు..స్విస్ కోర్టులకు ఇండియన్ల రిక్వెస్ట్