రాసిపెట్టుకో.. రేపు నీదే గెలుపు!

రాసిపెట్టుకో.. రేపు నీదే గెలుపు!
న్యూ ఇయర్​ వస్తుందనగానే అందరూ హ్యాపీ మూడ్​లో ఉంటారు. న్యూ ఇయర్​లో అట్లా చేయాలని, ఇట్లా చేయొద్దని చాలామంది అనుకుంటారు. అయితే అనుకున్నవన్నీ అయ్యాయా? అంటే చాలామంది చెప్పే ఆన్సర్​ ‘నో’.  అయినా హ్యాపీగానే ఉంటాం. ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఇంతే. ఇలాగే ఉంటే రేపు కూడా అనుకున్నది కాదు. హ్యాపీ న్యూ ఇయర్​ మాత్రం వస్తుంది. పోతుంది. ఇకముందు ఇలా కాకుండా ఉండాలంటే ప్లాన్​ ఉండాలి. న్యూ ఇయర్​కి ముందు రెజల్యూషన్​ తీసుకోవడం మామూలే. వీటిల్లో ఫెయిలయ్యే వాళ్లే ఎక్కువ. ఈ ఫెయిల్యూర్​కి ముఖ్యమైన కారణం గోల్​ సాధించాలనే పట్టుదల లేకపోవడమే. కారణం వాళ్లకు గోల్​ మీద ఒక క్లారిటీ ఉండదు. చాలా మందికి కోరికలుంటాయి. ఆ కోరికలే గోల్​ అనుకుంటారు. కోటీశ్వరుడు కావాలని, ఐఏఎస్​ కావాలని చాలా మందికి ఉంటుంది. అవే వాళ్ల గోల్​. కానీ, అవన్నీ కోరికలు. ఐఏఎస్ కావాలనుకోవడం కోరిక. ఐఏఎస్​​కి ప్రిపేర్​ కావడం గోల్. క్లారిటీ లేకనే సీరియస్​గా ఉండరు. చివరికి గోల్​ సాధించలేరు. పర్సనల్​ ఎనాలిసిస్ గోల్​ ఉండాలి. ఉంటేనే సాధిస్తారు. గోల్​ లేకుంటే రొటీన్​ లైఫ్​, రొటీన్​ సక్సెస్​ మాత్రమే ఉంటుంది. కచ్చితమైన గోల్​ ఉంటేనే గ్రాండ్​ సక్సెస్​ ఉంటుంది. ఆ సక్సెస్​ కావాలంటే న్యూ ఇయర్​ రెజల్యూషన్స్​ (గోల్స్​) అనుకునే ముందు లాస్ట్​ ఇయర్​ గోల్స్​ని గుర్తు చేసుకోవాలి. అవి సాధించామా? లేదా? చెక్​ చేసుకోవాలి. చివరి అయిదేళ్లలో ఏం అనుకున్నారు? ఏం సాధించారు? చివరి పదేళ్లలో ఏం అనుకున్నారు? ఏం సాధించారు? వాటిని ఎనాలసిస్​ చేస్తే రేపటి గోల్​కి ఒక క్లారిటీ వస్తుంది. సెల్ఫ్​ ఎనాలసిస్​ ఉంటేనే ఎంత చేయగలరో తెలుస్తుంది. ఏం సాధించగలరో క్లారిటీ వస్తుంది. గోల్​ పెట్టుకునే ముందు ఎనర్జీ లెవల్స్​, హెల్త్​ లెవల్స్, వెల్త్​ లెవల్స్​ లెక్కలేసుకోవాలె. అప్పుడే అనుకున్న గోల్​ తనకు సాధ్యమో? కాదో తెలుస్తది. హార్వర్డ్​ రీసెర్చ్​  పర్సనల్​ లైఫ్​లో సక్సెస్​ రేట్​ మీద హార్వర్డ్​ యూనివర్సిటీ ఓ స్టడీ చేసింది. ఈ రీసెర్చ్​లో మూడు రకాల వాళ్లని హార్వర్డ్​ మేనేజ్​మెంట్​ స్కూల్​ వాళ్లు ఐడెంటిఫై చేశారు. మనసులో గోల్​ నేను ఇది చేయాలని, అది సాధించాలని మనసులో అనుకుంటారు. వాటిని అప్పుడప్పుడూ అంటుంటారు. కానీ ప్రయత్నలోపంతో ఎక్కువ మంది ఫెయిలవుతారు. రేపటి నుంచి సిగరెట్లు మానేస్తానని, ఆల్కహాల్​ మానేస్తానని అనుకుంటారు. కానీ దానికి ఒక ప్లాన్​ ఉండదు. ఖచ్చితమైన మాత్రమే సక్సెస్​ అవుతారు. ఇలాంటి వాళ్లు 13 శాతం మంది ఉంటారు. నో గోల్​  మనసులో ఏ గోల్ ఉండదు. లైఫ్​ ఎటు తీసుకుపోతే అటు పోతుంటారు. ఇది కావాలని, ఇది చేయాలనే ఆలోచనే ఉండదు. ఇలా 84% మంది ఉంటారు. రిటెన్​ గోల్ సాధించాలనుకునే దాన్ని కాగితంపై పెడతారు. ఇలా చేయడం అంటే తనతో తాను కమిట్​ అయిపోవడం. ఇలా కమిట్​ అయినవాళ్ల సక్సెస్​ ఇతరుల సక్సెస్​ కంటే పది రెట్లు ఎక్కువగా ఉందని హార్వర్డ్​ స్టడీలో తేలింది. ఇలాంటి వాళ్లు 3 శాతం మాత్రమే ఉంటారు. రిటెన్​ గోల్​ పెట్టుకున్న వాళ్లలో 100 శాతం సక్సెస్​ అవుతున్నారు. సరిగా ప్లాన్​ చేసుకొని అమల్లో పెట్టి చూడండి రేపు నీదే గెలుపు. రైట్​ డౌన్​, స్పీక్​ అవుట్​ గోల్​ని కాగితం మీద పెడితే సరిపోదు. దానిని రిలేటివ్స్​కి, ఫ్రెండ్స్​కి చెప్పాలి. అనుకున్నది అందరికీ చెబితే ఆ గోల్​ని మర్చిపోయినప్పుడు రిలేటివ్స్​ మందలిస్తారు. ‘ఏమిటి టైమ్​ వేస్ట్​ చేసుకుంటున్నావ్​? గోల్​ని వదిలేశావా?’ అని మందలించే వాళ్లు, గుర్తుచేసేవాళ్లు ఉంటే సిగ్గుపడి మళ్లీ అనుకున్నదానిపై ఫోకస్​ చేస్తారు. స్మార్ట్​ (SMART) వే స్మార్ట్​ గోల్​ పెట్టుకుంటేనే సాధిస్తారు. కష్టపడి సాధిస్తామనుకుంటే కష్టమే. స్మార్ట్​ గోల్ (Smart Goal)​ అనేది ఒక స్ర్టాటజీ. గోల్​ స్పెసిఫిక్ (Specific)​గా ఉండాలి. లెక్క(Measure) ఉండాలి. డబ్బు సంపాదిస్తానంటే సరిపోదు. ఎంత సంపాదించాలో కూడా క్లారిటీ ఉండాలి. సాధ్యమయ్యే (Achieve) గోల్​ మాత్రమే పెట్టుకోవాలి. మ్యాథ్స్​లో తక్కువ మార్కులు వచ్చేవాళ్లు ఐఐటీలో సీటుని గోల్​గా పెట్టుకుంటే కష్టం. గోల్​ వాస్తవంగా (Realistic) సాధ్యమేనా? అని ఆలోచించాలి. తన బలం ఏమిటో? బలహీనత ఏమిటో తెలిసినప్పుడే సాధించగలిగే గోల్​ పెట్టుకుంటారు. టైం (Time) బౌండ్​ ఉండాలి. లైఫ్​ యాంబిషన్​ సాధించాలంటే ఏడాది షార్ట్​ టర్మ్​ గోల్​, మూడేళ్లకు మిడ్​ టర్మ్​ గోల్​, అయిదేళ్లకు లాంగ్​ టర్మ్​ గోల్​పెట్టుకోవాలి. ఈ మూడింటినీ పక్కాగా సాధిస్తే లైఫ్​ యాంబిషన్​ తీరినట్లే. – క్రాంతికార్​, సైకాలజీ​ కౌన్సిలర్​