నాటు నాటుకు ఆస్కార్ వస్తే పార్టీ ఇస్తా

నాటు నాటుకు ఆస్కార్ వస్తే పార్టీ ఇస్తా

RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంపై రచయిత చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్..ఆస్కార్ బరిలో నిలిచిందన్న వార్త తెలియగానే ఆనందించానని చెప్పారు. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వస్తే అందరికి మంచి పార్టీ ఇస్తానని చంద్రబోస్ తెలిపారు. 

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ అస్కార్ బరిలో నిలిచింది. RRR చిత్రం  నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నామినేట్ అయింది. 95వ అస్కార్ అవార్డు నామినేషన్స్‌లో నిలిచిన మూవీల జాబితాను ఆస్కార్ అవార్డుల కమిటీ ప్రకటించింది. 

నాటు నాటు సాంగ్  ఇప్పటికే  కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో  బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డును దక్కించుకుంది.  రెండు రోజుల క్రితం జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌లో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌’కేటగిరిలోనూ అవార్డుని RRR దక్కించుకుంది. తాజాగా బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అస్కార్కు నాటు నాటు నామినేట్ అయింది. మార్చి 12న  లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. RRR మూవీ దాదాపు రూ.400 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా రాబట్టింది.