ఇయ్యాల ఎస్ఐ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఇయ్యాల ఎస్ఐ పరీక్ష..  నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఎస్‌‌ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌ కోసం పోలీస్ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరుగనున్న పరీక్షలకు 2.47 లక్షల మంది హాజరుకానున్నారు. ఇందుకోసం గ్రేటర్‌‌ ‌‌హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లో 538 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎగ్జామ్ జరుగనుంది. సెంటర్‌‌‌‌లోకి ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను అనుమతిస్తారు.

10 గంటలకు గేట్లు మూసేస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. డీసీపీ స్థాయి అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.సెంటర్‌‌‌‌లోకి బ్లూ, బ్లాక్‌‌పెన్‌‌, హాల్ టికెట్‌‌ మినహా ఎలాంటి వస్తువులను అనుమతించరు. ఎలక్ట్రానిక్ డివైజెస్‌‌పై నిషేధం విధించారు. ఓఎమ్‌‌ఆర్‌‌ ‌‌షీట్‌‌ఇచ్చే ముందు బయోమెట్రిక్‌‌ చేస్తారు. మెహెందీ, ట్యాటూలు ఉండకూడదని అధికారులు సూచించారు.  పరీక్ష ముగిశాక ఓఎమ్‌‌ఆర్‌‌‌‌ షీట్‌‌ తీసుకున్న తర్వాత కూడా బయోమెట్రిక్ నిర్వహించనున్నారు.