బీజింగ్: చైనా కమ్యూనిస్టు పార్టీ శతవసంతాలు పూర్తి చేసుకుంటోంది. ప్రపంచమంతా కమ్యూనిజం ప్రభ తగ్గినా చైనాలో మాత్రం వెలుగుతోంది. ఈ నేపథ్యంలో శతవసంత ఉత్సవాలను కమ్యూనిస్టు పార్టీ ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమతో ఘర్షణ పడాలనుకుంటున్న దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఏ విదేశీ శక్తులకు తాము భయపడమని స్పష్టం చేశారు. చైనాతో ఎవరైనా పెట్టుకుంటే మాత్రం వారు 140 కోట్ల మందితో ఘర్షణ పడేందుకు సిద్ధపడాలని వార్నింగ్ ఇచ్చారు. జాతీయ భద్రతను పెంపొందించడానికి సైనిక వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. చైనాపై అణచివేతలు, బెదిరిపుంలకు పాల్పడితే అస్సలు భయపడబోమన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి చైనా ప్రజలు కట్టుబడి ఉన్నారని, అందుకు అవసరమైతే పోరాడేందుకు వారు సిద్ధమన్నారు.
