
నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో పోలీసు వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రణతి…మృతి చెందింది. ఈ రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ప్రణతి గుండె పని చేయడం లేదని తెలిపిన డాక్టర్లు.. చనిపోయినట్టు ప్రకటించారు. దీంతో ప్రణతి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణతి కోలుకోవాలని, మెరుగైన వైద్యం అందించటం కోసం చివరి వరకూ ప్రయత్నిచారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. వైద్య ఖర్చులను పూర్తిగా పోలీసులే అందించారు. అయితే చిన్నారి మృతి దిగ్భాంత్రి వ్యక్తం చేసిన ఎల్బీనగర్ ACP…చిన్నారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటామని CP హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రణతి అక్క ప్రీతి చదువుకు అయ్యే ఖర్చును పోలీస్ డిపార్ట్ మెంట్ భరిస్తుందని తెలిపారు.