గొర్రెల దాహం తీర్చాడు..శవమై తేలాడు

గొర్రెల దాహం తీర్చాడు..శవమై తేలాడు

యాదాద్రి భువనగిరి : గొర్లకు నీళ్లు తాపడానికి వెళ్లిన రాజేష్ అనే బాలుడు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగింది. భువనగిరి మండలం, వీరవెల్లి గ్రామానికి చెందిన చిన్నం ఐలయ్య కొడుకు రాజేష్(16) గొర్లకు నీళ్లు తాపడానికి పక్క గ్రామమైన వెలువర్తి చెరువుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు.

సమాచారం అందుకున్న వీరవెల్లి, వెలువర్తి గ్రామస్థులు 4 గంటల పాటు వెతికారు. అయినప్పటికీ బాలుడి ఆచూకి లభించలేదు. సాయంకాలానికి శవమై తేలాడు రాజేష్. సరైన సమయానికి గజ ఈతగాళ్లు వస్తే.. తమ కొడుకు బతికేవాడని కన్నీరుమున్నీరయ్యారు రాజేశ్ తల్లిదండ్రులు. అధికారులు పట్టించుకుని రాజేష్ కుటుంబానికి సాయం చేయాలని కోరారు గ్రామ అధికారులు. వేసవికావడంతో గొర్రెల దాహం తీర్చడానికి 10 కి.మి వెళ్లిమరీ రాజేష్ వాటి దాహం తీర్చాడని..కానీ..ప్రమాదవశాత్తు అతడు చనిపోయాడని తెలిపారు సాటి గొర్ల కాపర్లు.