యాదాద్రిలో ఘనంగా పూర్ణాహుతి

యాదాద్రిలో ఘనంగా పూర్ణాహుతి

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత బాలాలయంలో స్వామి అమ్మవార్లకు చక్రస్నాన ఘట్టం చేశారు.  పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రేపు ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయన్నారు ఆలయ అర్చకులు.