ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి ఆదేశం

యాదాద్రి, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి మొత్తం 33 ఫిర్యాదులు అందగా ఇందులో 20 అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవేనన్నారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. 

కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు దీపక్‌‌ తివారి, భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డీవో ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గెజిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లు, జర్నలిస్టులతో నిర్వహించిన గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు గెదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడడంలో ఆఫీసర్ల కృషి అమోఘం అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 

ఆఫీసర్లు సమయపాలన పాటించాలి

సూర్యాపేట, వెలుగు : ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల ఆఫీసర్లు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైంలో హాజరుకావాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి హాజరుకాని ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణికి మొత్తం 27 అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. సూర్యాపేట కుడకుడకు చెందిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే. ఖాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే దివ్యాంగుడు తనకు ట్రైసైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పించాలని అర్జీ ఇవ్వడంతో స్పందించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంటనే ట్రైసైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్ ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో ‘ముక్కోటి’ వేడుకలు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యాదగిరిగుట్ట, మఠంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతో పాటు, నల్గొండలోని రామాలయం, వీటీ కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇచ్చారు. యాదగిరిగుట్టలో మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, చీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ తోట భానుప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో పాలు పలువురు ఆఫీసర్లు స్వామివారిని దర్శించుకున్నారు. 

మఠంపల్లి ఆలయంలో ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దంపతులు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వామివారిని దర్శించుకున్నారు. నల్గొండ, మేళ్లచెరువు, కోదాడ, మునగాల, తుంగతుర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‌‌ - వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరసిస్తూ ఆందోళన

వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలతో పలు పట్టణాల్లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిష్టిబొమ్మ, ఫ్లెక్సీలను ను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ. 35 వేల కోట్లు ఇస్తే వాటిని దొంగచాటుగా వేరే అకౌంట్లకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం సరికాదన్నారు. స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పంచాయతీలకు విడుదల కావాల్సిన నిధులను ఏడు నెలలుగా నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచి వేసేందుకు ప్రయత్నం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎంతో మంది 

సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తుంటే వారికి ఇవ్వాల్సిన నిధులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. నల్గొండలో  టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, మునుగోడులో నియోజకవర్గ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురిగి నరసింహగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అలాగే హైదారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే ధర్నాకు వెళ్తుండగా సూర్యాపేటలో పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గట్టు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముదిరెడ్డి రమణారెడ్డి, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తుంగతుర్తి,  నాయకులను పోలీసులు ముందస్తుగా  అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు షురూ 

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అధ్యయనోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం ప్రధానాలయంలో ప్రత్యేక పూజలతో అధ్యయనోత్సవాలను మొదలుపెట్టారు. అనంతరం స్వామివారికి మత్స్యావతార సేవ చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాంగసుందరంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారిని అధిష్టింపజేసి మత్స్యావతార విశిష్టతను వివరించారు.

 జనవరి 7 వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 7 వరకు  సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలను రద్దు చేశారు. అలాగే వెండి మొక్కుజోడు సేవల టైమింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చారు. అధ్యయనోత్సవాలు జరిగే ఆరు రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు వెండి మొక్కు జోడు సేవలను నిర్వహించనున్నారు.

అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

మునగాల, వెలుగు : కొత్త, పాత అన్న తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరంలో ఏర్పాటు చేసిన పార్టీ శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే చేలా మంది టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఆసరా పింఛన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పల్లె దవాఖానా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయమ్మ, ఎంపీపీ ఎలుక బిందు నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించిన శివరామకృష్ణ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ

మిర్యాలగూడ, వెలుగు : మూడు రోజుల కింద కనిపించకుండా పోయిన మిర్యాలగూడకు చెందిన శివరామకృష్ణ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ సోమవారం గరిడేపల్లి మండలం పొనుగోడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరికింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెరువుకు చెందిన గుంటి జానకిరాములు, సరోజనమ్మల చిన్న కొడుకు శివరామకృష్ణకు పదేళ్ల కింద తన మేనకోడలు యామినితో వివాహమైంది. 

శివరామకృష్ణ మిర్యాలగూడలో మీ సేవ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తూ ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నాడు. గత నెల 30న శివరామకృష్ణ, యామిని మధ్య గొడవ జరగడంతో అతడు బయటకు వెళ్లగా, యామిని ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన శివరామకృష్ణ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐలాపురం వద్ద గల సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్వ సమీపంలో కనిపించింది. దీంతో అతడు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని ఉండొచ్చని అనుమానించి గాలింపు మొదలు పెట్టారు. సోమవారం పొనుగోడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు చెప్పారు. వారు వచ్చి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ శివరామకృష్ణదేనని గుర్తించి మిర్యాలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములను కాపాడాలి

సూర్యాపేట, వెలుగు : వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు, భూములను కాపాడాలంటూ ఆవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ జిల్లా కార్యదర్శి జహంగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ తిరుమలగిరి మండలం మాలిపురంలోని హజ్రత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుర్కనుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షావలీ దర్గాకు సంబంధించిన 47ఎకరాల భూములను స్థానిక తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రమంగా కొందరి పేరున ధరణిలో నమోదు చేశారని ఆరోపించారు. వారికి రైతుబంధు కూడా వస్తోందన్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లగా సర్వే చేయాలని ఆదేశాలు వచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాకీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సేనీ, జిల్లా సెక్రటరీ ఎండీ. అమ్జద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జావీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఈఎస్ఐ అవకతవకలపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తా: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ డిస్పెన్సరీ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సోమవారం డిస్పెన్సరీని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికంగా ఉండడంతో ఇక్కడ ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ  ఆస్పత్రి ఏర్పాటు చేయాలని గతంలోనే తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు చెప్పారు. 

డిస్పెన్సరీ ఉద్యోగ నియామక బాధ్యతను అర్హత లేని లీనా మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీకి ఏ ప్రాతిపదికన అప్పగించారో చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 3 లక్షలు తీసుకొని 18 మందిని ఎంపిక చేశారని ఆరోపించారు. అక్రమ వసూళ్లకు సంబంధించిన ఆడియో రికార్డులతో హైకోర్టుకు వెళ్లడంతో పాటు, స్టేట్, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీబీఐ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. డిస్పెన్సరీని సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

డిస్పెన్సరీలో క్వాలిటీ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాలని సూచించారు. అనంతరం హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద గల మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీని పరిశీలించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడ్డాక మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీని డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డుగా మార్చారన్నారు. కాలనీలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆయన వెంట దొంగరి వెంకటేశ్వర్లు, మంజునాయక్, కౌన్సిలర్లు కోతి సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కస్తాల శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.