ఏం.. చదువు చెబుతున్రు: టీచర్​పై యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సీరియస్

ఏం.. చదువు చెబుతున్రు: టీచర్​పై యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సీరియస్
  • టెన్త్​స్టూడెంట్స్​కు ఇంగ్లిష్ కూడా సరిగా వస్తలేదు
  • వెంటనే స్పెషల్​క్లాసులు తీసుకోవాలని ఆదేశాలు

యాదాద్రి, వెలుగు : ‘ టెన్త్​  క్లాస్​ స్టూడెంట్స్​కు ఇంగ్లిష్​ సరిగా వస్తలేదు. ఏం.. చదువు చెబుతున్నరు’.. అంటూ టీచర్​పై యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు సీరియస్​ అయ్యారు. గురువారం భువనగిరి మండలం బొల్లేపల్లి హైస్కూల్​ను గురువారం కలెక్టర్​ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా టెన్త్​క్లాస్ ​రూమ్​కు వెళ్లి ఓ స్టూడెంట్ వద్ద ఇంగ్లిష్ ​బుక్​తీసుకొని డిక్టేషన్​ చెప్పారు.  అనంతరం స్టూడెంట్స్​రాసిన నోట్​బుక్ లను  పరిశీలించారు. ఓ స్టూడెంట్ స్పెలింగ్​ అంతా  క్యాపిటల్ ​లెటర్స్​లో రాయగా..  మరికొందరు మధ్య మధ్యలో క్యాపిటల్ లెటర్స్​వాడారు.

ఓ స్టూడెంట్ ‘ అన్ కాంప్రమైజింగ్’ అన్న పదంలో  'యూ' చోట 'ఓ'​ రాశాడు. దీంతో స్టూడెంట్స్​కు ఎలా రాయాలో కలెక్టర్ సూచించారు.   కొందరు స్టూడెంట్స్ తో ఇంగ్లిష్​ పాఠం చదివించగా..  కొందరు ఒకటి రెండు పదాలు కూడా సరిగా చదవలేదు. దీంతో  కలెక్టర్ సీరియస్ ​అయ్యారు. ఏం చదువు చెబుతున్నారని ఇంగ్లిష్​ టీచర్​ను ప్రశ్నించారు. టెన్త్​ క్లాస్ ​స్టూడెంట్స్​కు ఇంగ్లిష్ ​రాయడం, చదవడం రాకుంటే ఎట్లా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్స్​కు అర్థమయ్యే విధంగా టీచర్స్​లెసెన్స్​ చెప్పాలని,  టీచింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.