అద్దెల భారానికి చెక్.. ప్రైవేట్ బిల్డింగ్లు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ డిపార్ట్మెంట్లు

అద్దెల భారానికి చెక్.. ప్రైవేట్ బిల్డింగ్లు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ  డిపార్ట్మెంట్లు
  • సర్కార్​ బిల్డింగ్​ల్లో 23 ఆఫీసులకు చోటు
  • ప్రతీ నెల రూ. లక్షల్లో సర్కారుకు మిగులు
  • మరో 12 ఆఫీసులకు త్వరలో కేటాయింపు

యాదాద్రి, వెలుగు:  అద్దెల భారం దింపుకునేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ప్రైవేట్​బిల్డింగ్‌ల్లో కొనసాగుతూ అద్దె చెల్లింపులు చేస్తున్న డిపార్ట్ మెంట్లలో కొన్నింటికి ఇతర ఆఫీసుల్లో సర్దుబాటు చేసింది. మిగిలిన వాటిని త్వరలో అడ్జస్ట్​ చేయనుంది. యాదాద్రి జిల్లాలోని అనేక డిపార్ట్​మెంట్లు దశాబ్దాల తరబడి ప్రైవేట్​ బిల్డింగ్​లోనే కొనసాగుతున్నాయి. ప్రైవేట్​ బిల్డింగ్‌ల్లో తహసీల్దార్​ ఆఫీసులతో పాటు పలు హాస్టల్స్​ కూడా ఉన్నాయి. చివరకు ఇంటిలిజెన్స్​ ఆఫీసు కూడా ప్రైవేట్​ బిల్డింగ్ లలోనే కొనసాగిస్తున్నారు.

ఈ విధంగా యాదాద్రి జిల్లాలోని హాస్టల్స్​సహా 35 విభాగాలు ప్రైవేట్​ బిల్డింగ్‌లో కొనసాగుతున్నాయి. ఇందుకోసం ప్రతి నెల రూ. లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అద్దె ఆలస్యమైన కారణంగా ఓనర్లు ఆయా బిల్డింగ్‌లకు తాళాలు కూడా వేస్తున్నారు.  మోత్కూరులో ప్రైవేట్​ బిల్డింగ్​లో కొనసాగుతున్న హాస్టల్​కు  ఓనర్​ తాళం వేశాడు. ఇలాంటి పరిణమాలతో పాటు రూ. లక్షల్లో అద్దె భారం తగ్గించుకోవడానికి ఆఫీసులను అడ్జస్ట్​మెంట్​ చేయాలని  నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసింది.  

ప్రభుత్వ బిల్డింగ్​ల్లోకి వెళ్లనున్న విభాగాలు, ఆఫీసులు, హాస్టల్స్​ ఇవే..

-భువనగిరిలోని కమర్షియల్ టాక్స్​ఆఫీసును ఖాళీగా ఉన్న  పాత లైబ్రరీని కేటాయించారు. -లీగల్​ మెట్రాలజీని కలెక్టరేట్​లోని ఏఓ ఆఫీసులో అడ్జస్ట్​ చేశారు. -చౌటుప్పల్​లోని తహసీల్దార్​ఆఫీసును మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న చోటును కేటాయించారు. -భువనగిరిలోని ఎక్సైజ్​ఆఫీసును రాయగిరిలోని పంచాయతీ బిల్డింగ్​ను కేటాయించారు. -మోత్కూరులోని ఎక్సైజ్​ఆఫీసును మున్సిపాలిటీ బిల్డింగ్‌లో అడ్జస్ట్​ చేశారు.  -ఆలేరులోని ఎక్సైజ్​ఆఫీసుకు  ఇండోర్​స్టేడియం పరిధిలోని ఖాళీ గదులను కేటాయించారు.

-రామన్నపేటలోని ఎక్సైజ్​ ఆఫీసుకు ఖాళీగా ఉన్న బీసీ హాస్టల్​ బిల్డింగ్​ను కేటాయించారు. -జిల్లా ఎక్సైజ్​ఎస్పీ ఆఫీసును కలెక్టరేట్​లోని  ఈ- బ్లాక్​ను కేటాయించనున్నారు. -చౌటుప్పల్​సబ్​డివిజన్​-4 ఇరిగేషన్​ ఈఈ ఆఫీసుకు మార్కెట్​ కమిటీ బిల్డింగ్  కేటాయించారు. ఆర్‌‌అండ్‌బీ ఎస్‌ఈ ఆఫీసును పాత మున్సిపాలిటీ బిల్డింగ్​లోని ఫస్ట్​ ఫ్లోర్​ లో అద్దె లేకుండా కంటిన్యూ చేయనున్నారు. -యాదగిరిగుట్టలోని సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసును స్కిల్​ డెవలప్​మెంట్​ బిల్డింగ్​ పరిధిలోకి మార్చనున్నారు. భువనగిరిలోని సబ్ రిజిస్ట్రార్​ఆఫీసును పాత మున్సిపల్​బిల్డింగ్​లో అద్దె లేకుండా కంటిన్యూ చేయనున్నారు. -రామన్నపేటలోని ఆర్‌‌అండ్‌బీ సబ్​డివిజన్​ ఆఫీసును ఖాళీగా ఉన్న బీసీ బాలుర  హాస్టల్​ బిల్డింగ్‌ కేటాయించారు.

-మోత్కూరులోని ఎస్టీవోను ఎంపీడీవో లేదా ఎంఏవో ఆఫీసులో అడ్జస్ట్​ చేయనున్నారు. - సంస్థాన్​ నారాయణపూర్‌‌లోని ఇరిగేషన్​సబ్​డివిజన్​-3ని ఫారెస్ట్​ బిల్డింగ్​లో అడ్జస్ట్​ చేయనున్నారు. -ఆలేరులోని ఫైర్​స్టేషన్​ను అవుట్​డోర్​ స్టేడియం పరిధిలో కొనసాగించనున్నారు. రామన్నపేటలోని ఐసీడీఎస్‌కు పాత పీఏసీఎస్​ బిల్డింగ్ కేటాయించారు. -రామన్నపేటలోని ఎస్​సీ, బీసీ బాలికల హాస్టల్స్ ​కు బీసీ హాస్టల్​ బిల్డింగ్​కేటాయించారు. -రామన్నపేటలోని అసిస్టెంట్​ సోషల్​వెల్ఫేర్​ఆఫీసుకు ఎస్సీ బాలుర హాస్టల్​ను కేటాయించారు. -చౌటుప్పల్​లోని సబ్​డివిజన్​-2 ఇరిగేషన్​ డీఈఈకి మహిళా కమ్యూనిటీ బిల్డింగ్​కేటాయించారు.  -భువనగిరిలోని పాత మున్సిపాలిటీ బిల్డింగ్​లోని ఓ పోర్షన్​ను ఇంటలిజెన్స్​ డిపార్ట్​మెంట్‌కు కేటాయించారు. -టీఎస్​ఆయిల్​ఫెడ్​ఆఫీసును కలెక్టరేట్‌లోని హార్టికల్చర్​ఆఫీసులో అడ్జస్ట్​ చేయనున్నారు.  

హాస్టల్స్​ సహా 23 విభాగాలు సర్కార్​ బిల్డింగ్‌ల్లోకి.. 

ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్​ బిల్డింగ్​లో కొనసాగుతున్న 35 ఆఫీసుల వివరాలను అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు(ఐఏఎస్​) తెప్పించుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ఖాళీగా ఉంటున్న వాటి వివరాలు కూడా తెప్పించుకున్నారు. ప్రైవేట్​ బిల్డింగ్​లో కొనసాగుతున్న విభాగాల ఆఫీసర్ల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లగలుగుతారో అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం కలెక్టరేట్​లోని పలు డిపార్ట్​మెంట్ల ఆఫీసుల్లో ఎక్కువ స్థలం ఉన్న వాటిల్లో ఇతర డిపార్ట్​మెంట్లను అడ్జెస్ట్​ చేయడం ప్రారంభించారు.

ఖాళీగా ఉంటున్న ప్రభుత్వ బిల్డింగ్​లను హాస్టల్స్​ సహా కొన్నింటికి కేటాయించారు. ఈ విధంగా ప్రైవేట్​ బిల్డింగ్​ల్లో కొనసాగుతున్న 35 ఆఫీసుల్లో 23 ఆఫీసులను అడ్జస్ట్​ చేశారు. మిగిలిన వాటికి కూడా త్వరలో అడ్జస్ట్​ చేయనున్నారు. ఈ కార్యాలయాలన్నీ వచ్చే నెల 1 నుంచి ప్రైవేట్​ బిల్డింగ్​లను ఖాళీ చేసి కేటాయించిన ఆఫీసుల్లో చేరిపోవాల్సి ఉంది. దీంతో ప్రభుత్వానికి ప్రతి నెల రూ. లక్షల భారం తగ్గిపోనుంది.