చేనేత కార్మికులకు రుణమాఫీ.. 2380 మందికి రూ. 19.24 కోట్లు మాఫీ

చేనేత కార్మికులకు రుణమాఫీ.. 2380 మందికి రూ. 19.24 కోట్లు మాఫీ

యాదాద్రి, వెలుగు:  చేనేత కార్మికులకు ప్రభుత్వం రుణమాఫీ రిలీజ్​ చేసింది. కార్మికుల అకౌంట్లలో శుక్రవారం జమ చేయనుంది. జిల్లాలో 43 చేనేత సొసైటీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు మెంబర్లుగా ఉన్నారు. డిపార్ట్​మెంట్​ లెక్కల ప్రకారం 2017 ఏప్రిల్​ నుంచి 2024 మార్చి వరకూ యాదాద్రి జిల్లాలోని 39 బ్యాంకుల్లో చేనేత కార్మికులు వ్యక్తగతంగా రుణాలు తీసుకున్నారు. 1162 మంది కార్మికులు రూ. వ్యక్తిగతంగా  లక్షలోపు రూ. 6 కోట్లు తీసుకోగా, రూ.లక్షకు పైగా 1537 మంది కార్మికులు రూ. 24 కోట్లు రుణాలు తీసుకున్నారు.

2689 మంది కార్మికులు కలిసి మొత్తంగా రూ. 30 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే వీరిలో కొందరు కార్మికులు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించారు. కాగా ప్రభుత్వ ఆదేశాలతో అడిషనల్​ కలెక్టర్​ భాస్కర్​ రావు (ఐఏఎస్​) ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశమై రుణాలు తీసుకున్న వారిలో 2380 మందిని గుర్తించింది. వీరు తీసుకున్న రూ. 19.24 కోట్లను మాఫీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో రుణమాఫీ చేయడానికి రూ. 19.24 కోట్లు రిలీజ్​ చేసింది.  కార్మికుల అకౌంట్లలో శుక్రవారం జమ చేస్తామని హ్యాండ్లూమ్​అసిస్టెంట్​డైరెక్టర్​అన్నదేవర శ్రీనివాస్​ తెలిపారు.