దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలి: సీఎం కేసీఆర్

దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలి: సీఎం కేసీఆర్

యాదాద్రి: దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. గురువారం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తైయ్యాని తెలిపారు. భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా.. యాదాద్రి నిర్మాణాలకు తుది మెరుగులు దిద్దాలని సీఎం సూచించారు.  ఆలయంలో లిఫ్టుల పనులు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. మూల విరాట్టు స్వామి సేవలు దూరం నుంచి కూర్చొని చూసినా కనిపించేలా ఉండాలని, విద్యుద్దీపాల కాంతులతో దేదీప్య మానంగా వెలిగే విధంగా విద్యుదీకరణ పనులను  తీర్చిదిద్దాలని సూచించారు.

అద్దాల మండపాన్ని పరిశీలించిన కేసీఆర్… రెయిలింగ్ పనుల పట్ల హర్షం వ్యక్తం చేశారు.  స్వామీ పుష్కరిణీ పనులు, మెట్ల దారి , భక్తుల సౌకర్యం కోసం పనులు, పూర్తి చేయాలన్నారు. లిఫ్టుల పనులు త్వరగా పూర్తి చేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు.