ఇందిరమ్మ చీరలు మంచిగున్నయ్.. యాదాద్రి కలెక్టర్‌‌తో వృద్ధురాలి ముచ్చట

ఇందిరమ్మ చీరలు మంచిగున్నయ్..   యాదాద్రి కలెక్టర్‌‌తో వృద్ధురాలి ముచ్చట

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పల్లె దవాఖానలో ఉన్న మడిపల్లి సోమక్క అనే వృద్ధురాలిని కలెక్టర్ హనుమంతరావు పలకరించారు. ఇందిరమ్మ చీరను ఇచ్చారా.? అని సోమక్కను కలెక్టర్ అడడగా.. ఇంకా ఇవ్వలేదని సోమక్క చెప్పడంతో.. మహిళా సంఘాల సభ్యులతో ఇందిరమ్మ చీరను తెప్పించి సోమక్కకు స్వయంగా అందజేశారు.

 అప్పుడిచ్చిన చీరలు మంచిగలేకపోవడంతో కట్టుకోలేదని, ఇప్పుడిచ్చిన ఇందిరమ్మ చీరల నాణ్యత, రంగు మంచిగుందని, తప్పకుండా చీర కట్టుకుంటానని చెప్పింది. కోడలుకిస్తవా.? నువ్వే కట్టుకుంటావా.? అని కలెక్టర్ అడడగా.. చీర మంచిగుంది, నేనే కట్టుకుండా అని సోమక్క బదులిచ్చింది. వంగపల్లి పల్లె దవాఖాన తనిఖీకి కలెక్టర్ హనుమంతరావు వచ్చిన సమయంలో.. హాస్పిటల్ లో ఎమ్.ఎల్.హెచ్.పి నీలిమ లేకపోవడంతో.. కలెక్టర్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, విలేజ్ సెక్రటరీ లావణ్య ఉన్నారు.