
- ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. భక్తులు కానుకలు సమర్పించగా రూ.2,41,35,238 నగదు, 143 గ్రాముల బంగారం, 4 . 250 కిలోల వెండి వచ్చిందని ఈవో భాస్కర్ రావు తెలిపారు. పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ భక్తులు వేసినట్టు వెల్లడించారు.
గత 34 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ లో కౌంట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులు పూజలు, నిత్య కైంకర్యాల చేయగా.. మంగళవారం ఆలయానికి రూ.24,39,016 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.