యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి పెరిగిన ఆదాయం

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి పెరిగిన ఆదాయం

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం పెరిగింది. గత 16 రోజుల హుండి ఆదాయాన్ని లెక్కించగా 87 లక్షల 40 వేల 899 రూపాయలు వచ్చింది. గత మార్చి 28వ తేదీన ప్రధానాలయం పునఃప్రారంభం అయ్యాక నిత్య ఆదాయంతో పాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో భక్తులు భారీగా తరలివస్తుండడంతో ఆలయానికి రద్దీ పెరుగుతోంది. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేసి మొక్కు తీర్చుకుంటుండడంతో ఆలయానికి భారీ ఆదాయం సమకూరుతోంది. మన డబ్బులతోపాటు విదేశీ నగదును కూడా భక్తులు సమర్పించారు. అలాగే ఆభరణాలను సైతం ఆలయ హుండీకి సమర్పించారు. 

16 రోజుల హుండీ ఆదాయం నగదు: రూ.87 లక్షల 40 వేల 899
మిశ్రమ బంగారము:  0-124-000 గ్రాములు,
మిశ్రమ వెండి కిలో:  0-990-000 గ్రాములు.

హుండీకి భక్తులు సమర్పించిన విదేశీ నగదు

అమెరికా - 405 డాలర్లు
యూఏఈ -100 దిరామ్స్
ఆస్ట్రేలియా -50 డాలర్స్
మలేషియా -1 రింగ్గిట్
యూరో -55
ఒమాన్ -100 బైసా 
ఫ్రాన్స్ -10
న్యూజీలాండ్ -10 డాలర్లు