యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
  •     ఫ్రీ దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ప్రదేశం, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్ కిటకిటలాడాయి. 

రద్దీ కారణంగా స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. మరో వైపు ఆలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.