సినర్ ‘సన్‌‌‌‌షైన్ డబుల్’ మయామి ఓపెన్ విన్నర్‌‌‌‌‌‌‌‌గా యానిక్

సినర్ ‘సన్‌‌‌‌షైన్ డబుల్’ మయామి ఓపెన్ విన్నర్‌‌‌‌‌‌‌‌గా యానిక్

మయామి గార్డెన్స్‌‌‌‌ (ఫ్లోరిడా): ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ తన కెరీర్‌‌‌‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన మయామి ఓపెన్ మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌  ఫైనల్లో 6–-4, 6–4 తేడాతో జిరి లెహెకా (చెక్ రిపబ్లిక్‌‌‌‌)ను  వరుస సెట్లలో మట్టికరిపించి చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. 

దాంతో ఒకే ఏడాది వరుసగా ఇండియన్ వెల్స్, మయామి టైటిళ్లు నెగ్గి అరుదైన ‘సన్ షైన్ డబుల్’ ను సొంతం చేసుకున్నాడు. 2017లో రోజర్ ఫెడరర్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ సినర్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గాడు. ఫైనల్లో 10 ఏస్‌‌‌‌లతో విరుచుకుపడ్డ ఈ ఇటలీ స్టార్.. లెహెకాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.