హిందీ సలహా సంఘం సభ్యుడిగా యార్లగడ్డ

హిందీ సలహా సంఘం సభ్యుడిగా యార్లగడ్డ

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు, హిందీ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవలు అందించిన పద్మభూషణ్‌‌‌‌ అవార్డు గ్రహీత, హిందీ పరిషత్‌‌‌‌ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌‌‌‌కు మరో అరుదైన చాన్స్​ దక్కింది. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఆయ న్ను హిందీ సలహా సంఘం సభ్యుడిగా నియ మించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 పది మంది సభ్యుల్లో దక్షిణాది నుంచి యార్లగడ్డ ఒక్కరికే చోటు దక్కింది. సలహా సంఘం సభ్యుడిగా ఆయన మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మంత్రిత్వ శాఖలోని హిందీ కార్యక్రమాలకు ఈ సంఘం సలహాలు అందించనుంది. ప్రధాని మోదీ చైర్మన్‌‌‌‌గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్థలో యార్లగడ్డకు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన అంతర్జాతీయంగా తెలుగు భాష సాహిత్యం, సంస్కృతి వికాసానికి కృషి చేశారు. తెలుగు భాషా సాహిత్యాలను హిందీలోకి అనువదించి వాటికి ప్రాచుర్యం కల్పించారు.