Toxic Teaser: గోవా నేర చరిత్రను వణికించే రాయా కథ.. యష్ ‘టాక్సిక్’ టీజర్ సంచలనం

Toxic Teaser: గోవా నేర చరిత్రను వణికించే రాయా కథ.. యష్ ‘టాక్సిక్’ టీజర్ సంచలనం

కన్నడ స్టార్ యష్ ‘KGF: Chapter 2’ తర్వాత భారీ విరామం తీసుకుని మళ్లీ వెండితెరపైకి వస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమా 2026 మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. 

ఈ సందర్భంగా శుక్రవారం (2026 ఫిబ్రవరి 20న) పవర్ ఫుల్ టీజర్ విడుదల చేశారు. రిలీజైన క్షణాల్లోనే టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో యష్ ‘రాయా’ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించాడు. 1 నిమిషం 55 సెకన్ల నిడివి గల ఈ టీజర్ భారీ అంచనాలు పెంచింది.

గోవా క్రైమ్ డ్రగ్ బ్యాక్డ్రాప్ సాగాలో భయానికే సామ్రాజ్యం నిర్మించే దిశగా యష్ బీభత్సం స్పృష్టించాడు. రెట్రో స్టైల్ విజువల్స్, బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గన్‌షాట్స్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు చిత్రంలోని తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. నమ్మకాలు అనుమానాలుగా మారే ప్రపంచంలో భయం ఎలా తాండవం చేయనుందో అనే సంకేతంగా టీజర్ నిలిచింది.

‘ఈ సారి యుద్ధం వేరు.. వాళ్ళ కుతంత్రాలు వేరు.. అందరితో విరోధం పెట్టుకొని బతకలేవు.. పట్టుదల వదిలేయ్’ అనే డైలాగ్ మోస్ట్‌ వైలెంట్‌గా ఉంది’ అనే డైలాగ్ మోస్ట్‌ వైలెంట్‌గా ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే టీజర్ చివర్లో వచ్చే మోస్ట్ వైలెంట్ క్రైమ్ సీన్ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.  

మొత్తంగా, ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్ యష్‌ను ఒక కొత్త, డార్క్ అవతారంలో చూపిస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన పవర్, హింస, లోభం, మానవ బలహీనతలు అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని బలమైన టాక్.

ముఖ్యంగా క్రైమ్, రాజకీయాలు, అండర్‌వల్డ్ నెట్‌వర్క్ వంటి అంశాలు చర్చించనున్నారు. ఈ క్రైమ్, శక్తి, ద్రోహం, భయం మేళవించిన టాక్సిక్ కథ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అతి భారీ అంచనాలున్నాయి. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో యష్కి జోడీగా కియారా అద్వానీ, నయనతార నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.