యావర్ రోడ్డు ను 100 ఫీట్లు విస్తరణ చేయాలి

యావర్ రోడ్డు ను 100 ఫీట్లు విస్తరణ చేయాలి

జగిత్యాల మున్సిపాలిటీ లో జరుగుతున్న అక్రమాలపై అధికారులకు ముందే హెచ్చరించానని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ పై జరిగిన ఏసీబీ దాడులు అధికార యంత్రాంగం పై మాయని మచ్చఅని అన్నారు. జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాలపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఉన్న మున్సిపల్ పాలక వర్గం సలహాలు, సూచనలు తీసుకుని… యావర్ రోడ్డును 100 ఫీట్లు విస్తీర్ణం చేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. యావర్ రోడ్డు సమస్య మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉందన్నారు. ఇప్పటికైనా యావర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి.