
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్ములేపుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.
25 పార్లమెంట్ స్థానాల్లో 24 సెగ్మెంట్లలో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. గంపగుత్తగా అన్ని స్థానాలను వైసీపీ గెల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఆంధ్రా ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గెలిపించిన ఓటర్లు… స్వల్ప తేడాతో వైసీపీని ఓడించారు. కానీ ఈసారి ఎన్నికల్లో… ల్యాండ్ స్లైడ్ విక్టరీని వైసీపీకి అందించినట్టుగా ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఫలితాల్లో జగన్ పార్టీ జయకేతనం ఎగరేస్తోంది. దీంతో.. వైసీపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.