
ఈనెల 22న ఉండవల్లికి వైఎస్ జగన్
హైదరాబాద్ లోని YSRCP పార్టీ కేంద్ర కార్యాలయం అమరావతికి తరలిస్తున్నారు. రాజధాని అమరావతికి పక్కనే ఉన్న ఉండవల్లికి పార్టీ హెడ్ ఆఫీస్ ను మార్చుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉండవల్లి గ్రామం ఉంది.
బంజారాహిల్స్ లోటస్ పాండ్ లోని వైసీపీ ఆఫీస్ నుంచి… ఫర్నీచర్ ను ఈ ఉదయం ఉండవల్లిలో పార్టీ ఆఫీస్ కు తీసుకెళ్లారు. వారంరోజుల్లో అక్కడ పార్టీ ఆఫీస్ ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు పార్టీ అధినేత వైఎస్ జగన్.
ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గరపడటంతో… పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేసింది వైసీపీ. ఈ నెల 16 న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 21లోగా పార్టీ కీలక నేతలు అందరూ విజయవాడలో అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీచేశారు.
ఈనెల 22న ఉండవల్లి లోని పార్టీ హెడ్ ఆఫీస్ కు వైఎస్ జగన్ వెళ్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ మే 23. ఇందుకు ఒక రోజు ముందు 22వ తేదీ నుంచి పార్టీ కార్యకలాపాలు ఉండవల్లి కార్యాలయం నుంచే నిర్వహించాలలని వైఎస్ జగన్ నిర్ణయించారు.