ఆసరా పెన్షన్ రూ.3వేలకు పెంపు

ఆసరా పెన్షన్ రూ.3వేలకు పెంపు

ఆంధ్రప్రదేశ్ లో ఆసరా లబ్దిదారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ఆసరా పెన్షన్లను రూ.3వేలకు పెంచుతున్నట్లు  ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. జనవరి 3వ తేదీ బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన పింఛన్ల పెంపు  కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొని.. రూ.2750గా ఉన్న పెన్షన్లను రూ.3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్ పెన్షన్ కానుకగా ద్వారా ఆసరా పెన్షన్లను రూ.3వేలకు పెంచామని చెప్పారు.

రాష్ట్రంలో 66.34 లక్షల మందికి ఒకటో తేదీన పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్ల కోసం ప్రతీ సంవత్సరం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్త ఏడాది అంటే క్యాలెండర్ లో మార్పు కాదు.. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు రావాలి.

గతానికి , ఇప్పుడు తేడా చూడండి.. ఎన్నికలు 2 నెలలు ముందు చంద్రబాబు పెన్షన్‌ పెంచారు..గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ. 58 వేలు మాత్రమే  పెన్షన్‌ ఇచ్చారని.. మన ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్కొక్కరికి లక్షా 47 వేల పెన్షన్‌ ఇస్తోంది- సీఎం తెలిపారు.