చుక్కేసి.. చిందేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు

చుక్కేసి.. చిందేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు

వైసీపీ నేతలు  రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంతోపాటు.. డ్యాన్సర్లతో నేతలు చిందేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం   ఏలేశ్వరం మండలం యర్రవరంలో జరిగిందీ సంఘటన. వివరాల్లోకి వెళ్తే.. యర్రవరం సర్పంచ్  సర్పంచ్ బీసెట్టి అప్పల రాజు  పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడమే కాకుండా... కొంతమంది వైసీపీ నేతలు డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేశారు.  నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. విందుతోపాటు వినోదంలో భాగంగా నాయకులై ఉండి డ్యాన్సర్లతో స్టేజీపై నృత్యం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ఏలేశ్వరం జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి భర్త సత్యనారాయణ , యర్రవరం సర్పంచ్ బేసెట్టి అప్పల రాజు యర్రవరం ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ గుల్లంపూడి గంగాధర్  పాల్గొన్నారు.