
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీను రెండు రోజులపాటు పోలీసు కస్టడీ నూజివీడు కోర్టు అనుమతించింది.
నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి వంశీకి ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీ నుంచి నకిలీ ఇళ్ల పట్టాలకు ఇంకా సమాచారం రాబట్టేందుకు .. పోలీసుకస్టడీకి ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి నూజివీడు కోర్టు అనుమతించింది.
ఏపీ లిక్కర్ కేసు లో సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ ఈ 27 కు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.. ఇదే కేసులో మరో నిందితుడు పైలా దిలీప్ బెయిల్ పిటిషన్ ను ఈనెల 26కు వాయిదా వేసింది . ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసేందుకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులోనే మరో నిందితుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 27కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగించారు. ఏపీపీఎస్సీ కేసులో ఆయనకు జూన్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు విజయవాడ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో, పీఎస్ఆర్ ను కాసేపట్లో విజయవాడ జైలుకు తరలించనున్నారు. పీఎస్సార్ ను కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు మే 23కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. నటిజత్వాని కేసు... ఏపీపీఎస్సీ అక్రమాల కేసుల్లో రిమాండ్ లో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారణ చేపట్టనుంది.