చంద్రబాబును ముసలి నక్క అనాలంటే నాకే బాధేస్తుంది: మంత్రి బొత్స

చంద్రబాబును ముసలి నక్క  అనాలంటే నాకే బాధేస్తుంది: మంత్రి బొత్స

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై బొత్స అదే స్థాయిలో స్పందించారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. జీపీఎస్‌పై మంత్రుల కమిటీతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై..  వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. .  నేను గేట్ తెరిస్తే వైసీపీలో ఎవ్వరూ మిగలరని చంద్రబాబు అంటారు. ఏమైనా అంటే కుర్రాడు జగన్ అంటావు. నువ్వు జిత్తుల మారి నక్కవు. చంద్రబాబు వెళ్ళింది ఎన్టీఆర్ కాయిన్ ఆవిష్కరణకు మాత్రమే. ఉగాది తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదు. ఈ మాట మరోసారి చెబుతున్నా. మేనిఫెస్టోలో ఇచ్చిన 98 శాతం హామీలు నెరవేర్చాం. ముసలి నక్క అని నిన్ను అనాలంటే నాకే బాధేస్తుంది. ఇకనైనా చంద్రబాబు నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఢిల్లీలో  వెళ్లి ఎవరి ఇంటి ముందు ఎవరు తిరుగుతున్నారు.. చంద్రబాబు తిరగడం లేదా?" అని మంత్రి బొత్స మండిపడ్డారు.