వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే..

వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించటంతో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరో పక్క పార్టీ ఫిరాయింపులు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీకి ఫిరాయింపుల సెగ గట్టిగానే తగులుతోంది. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న షర్మిల వైసీపీ నుండి చేరికలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు.

పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జమ్మలమడుగులో ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి టికెట్ ఆశించిన చిట్టిబాబు టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. చిట్టిబాబు పార్టీని వీడటం పి. గన్నవరంలో వైసీపీకి మైనస్ అవుతుందనే చెప్పాలి. మరి, చిట్టిబాబుకు కాంగ్రెస్ లో అయినా ఆశించిన న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.