జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు

జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు

 ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల్లో గుబులు మొదలైంది. సిట్టింగ్ ఎమ్మె్ల్యే తమకు టికెట్ వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. పార్టీ అధిష్టానం తమను ఎంపిక చేస్తుందా లేక వేరే వారిని ఎంపిక చేస్తుందా అని భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ బాటలో  పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్ ఎస్ బాబు వచ్చి చేరారు. టికెట్ కేటాయించే విషయంలో తన ఆవేదనను వ్యక్తం  చేశారు. పార్టీ అధిష్టానం పై ఓ తీరు నిప్పులు చెరిగారు.

 గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నానని ఎమ్ ఎస్ బాబు చెప్పారు.  ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత..? అని  ప్రశ్నించారు. ఐదేళ్ళలో ఒక్కసారి కూడా తమను పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదని అన్నారు. డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని చెప్పారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

ఇప్పటికి తనకు వైసీపి నమ్మకం ఉందని పార్టీ వీడే ప్రసక్తే లేదని బాబు అన్నారు.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గౌరవం ఉందని చెప్పారు. ఆయన తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మె్ల్యే ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం నియోజకవర్గ వైసీపీ నేతలను కలవరానికి గురిచేస్తుందని చర్చ నడుస్తోంది. మరి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.