
విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు ఏపీ వైసీసీ ఎమ్మెల్యే రోజా. అందరి ఉసురు తగిలి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు తనను ఎంతో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు రోజా. ఇవాళ తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. చంద్రబాబు దొంగ ఏడుపులకు ఎవరూ జాలి చూపించరని చెప్పారామె. జీవితంలో అసెంబ్లీలో పెట్టని విధంగా బాబే శపథం చేసుకున్నారన్నారు రోజా.
కర్మ ఫలితం అనుభవించు బాబు, అధికారం చేతిలో ఉందని మహిళలు అని కూడా చూడకుండా నాడు నన్ను, జగనన్న కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురిచేసింది మరిచిపోయావా? నీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు !#APAssembly #DramaBabuNaidu pic.twitter.com/55IdzkVzdX
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 19, 2021