
చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన భరత్ రామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఏ రోజైతే చూశానో నిన్ను’. రాజు బొనగాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో హీరోయిన్‌ను ఎంపిక చేసి డిసెంబర్‌లో షూట్ మొదలుపెడుతున్నట్టుగా మేకర్స్ తెలియజేశారు.