IPL Final RCB vs GT: ఐపీఎల్ ఫైనల్ వేళ అహ్మదాబాద్ లో ఎల్లో అలర్ట్... RCB vs GT మ్యాచ్ వాయిదా తప్పదా..?

IPL Final RCB vs GT: ఐపీఎల్ ఫైనల్ వేళ అహ్మదాబాద్ లో ఎల్లో అలర్ట్... RCB vs GT మ్యాచ్ వాయిదా తప్పదా..?

ఐపీఎల్ 2026 లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బెంగుళూరు, గుజరాత్ మధ్య జరుగుతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఆర్సీబీ, గుజరాత్ టీంలు ఫైనల్​ పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్​లో జరిగే మ్యాచ్​లో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోడానికి రెండు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. జట్ల బలాల పరంగా చూస్తే ఆర్సీబీ ఫేవరెట్​గా  కన్పిస్తున్నది. సొంత గ్రౌండ్​లో మ్యాచ్​ జరగడం టైటాన్స్​కు అనుకూలాంశంగా ఉంది. అయితే... ఈ మ్యాచ్ వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.

అహ్మదాబాద్ లో వాతావరణ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మే 30 నుండి జూన్ 2 వరకు అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడమే ఇందుకు కారణం.ముఖ్యంగా అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్న క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇది అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.

వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన మ్యాచ్ రద్దయితే... విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారన్న టెన్షన్ ఫ్యాన్స్ లో నెలకొంది. అయితే.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం ఒక రిజర్వ్ డే కేటాయిస్తారు. ఒకవేళా ఇవాళ జరగాల్సిన మ్యాచ్ రద్దయితే.. రేపు ( జూన్ 1 ) మ్యాచ్ నిర్వహిస్తారు.

జట్లు (అంచనా):

బెంగళూరు: రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), విరాట్ కోహ్లీ, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / ఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా, టిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జితేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, రొమారియో షెఫర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాకబ్ డఫీ / సుయాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ. 

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోస్​ బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్​ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిశాంత్ సింధు, జేసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెవాటియా, రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కగిసో రబాడ, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.