వాతావరణ శాఖ జారీ చేసే రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అంటే ఏంటి?

 వాతావరణ శాఖ జారీ చేసే రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అంటే ఏంటి?

వర్షకాలంలో వర్షాలు కురుస్తున్నప్పుడు  వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను జారీ చేస్తుంది.  అసలు ఈ రంగులేంటి? ఏ రంగు దేనికి దేనిని సూచిస్తు్ంది అన్నది చాలా మందికి తెలియదు. వాతావరణ పరిస్థితులను సూచించేందుకు కలర్​ కోడ్స్​ను జారీ చేస్తుంటుంది ఐఎండీ. 

ఎల్లో అలర్ట్  :  ప్రజలను అప్రమత్తం చేయడానికి వాతావరణ శాఖ దీనిని సూచిస్తు్ంది.  7.5 మి.మీ నుంచి 15 మి.మీ మధ్య వర్షపాతం సుమారు గంట నుంచి రెండు గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ఇస్తారు.  

ఆరెంజ్ అలర్ట్ : వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.

రెడ్ అలర్ట్ :  ఇది డేంజర్ పరిస్థితి అన్నమాట.. వాతావరణం డేంజర్ లెవల్స్ దాటినప్పుడు, ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినప్పుడు రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తారు.  సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 

హైదరాబాద్​లో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద చేరింది. మోకాళ్లలోతు నీరు చేరడంతో జనం ఇండ్లలోంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు.  అమీర్ పేట్, బల్కంపేట్, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద చేరింది. 

అత్యధికంగా బోరబండలో 8.8 సెంటిమీటర్లు, మూసాపేట్ లో 7.7, జూబ్లీహిల్స్ లో 7.4, గచ్చిబౌలిలో 6.2, మాదాపూర్ లో 6, బంజారాహిల్స్ లో 5.4 సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసింది.