
విజయ్ దేవరకొండ, నాని, మాళవిక నాయర్ బైక్‌పై కనిపిస్తున్న ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ముగ్గురు కలిసి నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం విడుదలై మార్చి 21కి పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా అదే రోజున రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్.. రీ యూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ పాల్గొనడమే కాకుండా ఈ మూవీ పోస్టర్‌ను రీ క్రియేట్ చేశారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో విజయం సాధించి హీరోలు నాని, విజయ్ దేవరకొండలకు మెమొరబుల్ మూవీలో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా వార్ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఈ ఫొటోతో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రంలో నటిస్తుండగా, నాని ‘హిట్ 3’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.