
- ఉగ్రవాదాన్ని అణచివేయాల్సినటైం వచ్చింది: యోగి ఆదిత్యనాథ్
- దేశం మొత్తం ఐక్యంగా మోదీ వెనుక ఉండాలని పిలుపు
లక్నో: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా మన బ్రహ్మోస్ మిసైల్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇంకా ఎవరికైనా బ్రహ్మోస్ పవరేంటో తెలుసుకోవాలని ఉంటే పాకిస్తాన్‌ను అడగాలని సూచించారు. లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించగా.. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతోసహా అణచివేయాల్సి సమయం వచ్చిందని, దేశ ప్రజలందరూ ఐక్యంగా ప్రధాని మోదీ వెంట ఉండాలని పిలుపునిచ్చారు. టెర్రరిజం అనేది కుక్క తోకలాంటిదని, దానికి ఎన్నటికీ సరిచేయలేమని అన్నారు. ‘‘ఉగ్రవాదానికి ప్రేమ భాష తెలియదు. దాని భాషలోనే మనం బదులివ్వాలి. ఈ దిశలో ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ఒక సందేశం ఇచ్చింది” అని తెలిపారు. ఆపరేషన్సిందూర్ విజయవంతమైనందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, భారత సాయుధ బలగాలకు అభినందనలు తెలిపారు.